హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..

హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) బాధ్యతలు స్వీకరించారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది.

 Kothakota Srinivas Reddy Took Charge As Hyderabad Cp, Kothakota Srinivas Reddy ,-TeluguStop.com

గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు.నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరు ఉంది.

బుధవారం ఉదయం రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

తన శక్తి సామర్థ్యాలు గుర్తించి సీపీగా బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.ఇప్పుడు హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదంను నిర్మూలిస్తామన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని తెలిపారు.ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానన్నారు.

మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అలెర్ట్ ఉండాలన్నారు.

సంఘటన జరిగినప్పుడు పోలీస్ క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమని చెప్పుకొచ్చారు.

మహిళల వేధింపులు, ర్యాగింగ్‌‌లపై షీ టీమ్స్ ద్వారా మరింత పని తీరును మెరుగు పరుస్తామన్నారు.తెలంగాణా స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారన్నారు.

హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు.

డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాడమే తమ లక్ష్యమన్నారు.

గతంలో డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపారన్నారు.హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్ళాలని.

లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్‌ ముఠాను హెచ్చరించారు.సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు.

మారకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామన్నారు.సినీ పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube