నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridhar Reddy ) రాజకీయ భవిష్యత్ గందరగోళం లో పడినట్లు కనిపిస్తోంది.తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ సొంత పార్టీ వైసిపి ప్రభుత్వంపైనే, ఆ పార్టీ పెద్దలపైన శ్రీధర్ రెడ్డి విమర్శలు చేసి , ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు.
పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు, వెంటనే నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు.దీంతో శ్రీధర్ రెడ్డి కూడా తానేమి తగ్గేదే లేదు అన్నట్లుగా రాబోయే ఎన్నికల్లో టిడిపి ( TDP ) అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తానంటూ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ ప్రకటనపై నెల్లూరు టిడిపి నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.శ్రీధర్ రెడ్డి ఇంకా పార్టీలో చేరకుండానే , అధినేత చంద్రబాబు అనుమతి లేకుండానే టికెట్ ప్రకటించుకోవడం ఏమిటని ఫైర్ అవ్వడంతో పాటు, ఈ విషయంపై చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టారు.
శ్రీధర్ రెడ్డి కారణంగా టిడిపి క్యాడర్ ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, అనేక కేసుల్లో ఇరుక్కోవడం, జైలు జీవితం గడపడం వంటివి చేసుకున్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను పార్టీలో చేర్చుకోవద్దంటూ చంద్రబాబు వద్ద తమ వాదనను వినిపించడంతో శ్రీధర్ రెడ్డి చేరికకు బ్రేకు పడింది.
దీంతో ఆయన అటు వైసిపి కి దూరమై, టిడిపికి దగ్గర కాలేక రాజకీయ ఇబ్బందులు పడుతున్నారు.ఇది ఇలా ఉండగానే శ్రీధర్ రెడ్డి సోదరుడు వైయస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు .పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గిరిధర్ రెడ్డి( kotamreddy Giridhar Reddy ) పాల్పడుతున్నందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటన కూడా విడుదల చేసింది.దీంతో ఇప్పుడు గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈనెల 24న టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో గిరిధర్ రెడ్డి టిడిపి కండువా కప్పుకోబోతున్నారు.కానీ శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఎటు తేల్చకపోవడంతో శ్రీధర్ రెడ్డి లోను ఆందోళన కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేద్దామని చూస్తున్న, ఆ పార్టీ నుంచి సరైన స్పందన లేకపోవడం, జిల్లాలోని టిడిపి నాయకులు తన రాకను వ్యతిరేకిస్తూ ఉండడం , ఇవన్నీ శ్రీధర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి.దీంతో శ్రీధర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారట.