ఆ ఒక్క పాటతో లాగించేస్తున్నారు భయ్యా...!

మలయాళం లో సూపర్‌ హిట్ అయిన సినిమా కు రీమేక్ గా రూపొందిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌( Kota Bommali PS ).ఈ సినిమా లో శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించాడు.

 Kotabommali Ps Movie Promotions , Kota Bommali Ps , Shivani Rajashekar ,ling-TeluguStop.com

ఆయన పాత్ర పాజిటివ్ గా ఉంటుందా, నెగటివ్ గా ఉంటుందా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.ఇక ఈ సినిమాలో యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌ ( Shivani Rajashekar )కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఆమె ను ఈ సినిమా లో డీ గ్లామర్ పాత్ర లో చూపించబోతున్నారు.

అంతే కాకుండా ఆమె ను ఒక లేడీ కానిస్టేబుల్‌ గా చూడబోతున్నామని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ఇతర విషయాలను బట్టి అర్థం అవుతోంది.ఈ సినిమా నుంచి వచ్చిన లింగి లింగి లింగిడి పాట( Lingi Lingi Lingidi ) సూపర్‌ హిట్ అయింది.ఆ పాట వల్లే సినిమా గురించి జనాలకు తెలిసింది.

ఆ పాట అంతగా హిట్ అవ్వకుంటే కచ్చితంగా ప్రమోషన్‌ కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది.ఈ రేంజ్ లో పాట కు పబ్లిసిటీ దక్కడం వల్లే ఇప్పుడు సినిమా కు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.

గీతా ఆర్ట్స్ నుంచి ఈ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.పెద్దగా ప్రమోషన్స్‌ లేకుండా, హడావుడి లేకుండా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అయ్యారు.ముందు ముందు ఈ సినిమా కు సంబంధించిన భారీ వసూళ్ల వార్తలు వింటామని మేకర్స్ చెబుతున్నారు.సినిమా లో విభిన్నమైన పాయింట్‌ ను తెలుగు ప్రేక్షకులు నచ్చే విధంగా చర్చించడం జరిగింది.

కనుక ఆ పాయింట్ అందరికి కూడా నచ్చుతుంది.అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను మరో నాలుగు రోజుల్లో విడుదల చేస్తున్నారు.కనుక ఇప్పటికి అయినా ప్రచారం జోరు పెంచాలని నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube