ఆ ఒక్క పాటతో లాగించేస్తున్నారు భయ్యా…!

మలయాళం లో సూపర్‌ హిట్ అయిన సినిమా కు రీమేక్ గా రూపొందిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌( Kota Bommali PS ).

ఈ సినిమా లో శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించాడు.ఆయన పాత్ర పాజిటివ్ గా ఉంటుందా, నెగటివ్ గా ఉంటుందా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

ఇక ఈ సినిమాలో యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌ ( Shivani Rajashekar )కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఆమె ను ఈ సినిమా లో డీ గ్లామర్ పాత్ర లో చూపించబోతున్నారు.

"""/" / అంతే కాకుండా ఆమె ను ఒక లేడీ కానిస్టేబుల్‌ గా చూడబోతున్నామని ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు ఇతర విషయాలను బట్టి అర్థం అవుతోంది.

ఈ సినిమా నుంచి వచ్చిన లింగి లింగి లింగిడి పాట( Lingi Lingi Lingidi ) సూపర్‌ హిట్ అయింది.

ఆ పాట వల్లే సినిమా గురించి జనాలకు తెలిసింది.ఆ పాట అంతగా హిట్ అవ్వకుంటే కచ్చితంగా ప్రమోషన్‌ కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది.

ఈ రేంజ్ లో పాట కు పబ్లిసిటీ దక్కడం వల్లే ఇప్పుడు సినిమా కు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.

"""/" / గీతా ఆర్ట్స్ నుంచి ఈ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.

పెద్దగా ప్రమోషన్స్‌ లేకుండా, హడావుడి లేకుండా థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం అయ్యారు.

ముందు ముందు ఈ సినిమా కు సంబంధించిన భారీ వసూళ్ల వార్తలు వింటామని మేకర్స్ చెబుతున్నారు.

సినిమా లో విభిన్నమైన పాయింట్‌ ను తెలుగు ప్రేక్షకులు నచ్చే విధంగా చర్చించడం జరిగింది.

కనుక ఆ పాయింట్ అందరికి కూడా నచ్చుతుంది.అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను మరో నాలుగు రోజుల్లో విడుదల చేస్తున్నారు.

కనుక ఇప్పటికి అయినా ప్రచారం జోరు పెంచాలని నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో: 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి..చివరగా..?