టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి అందరిని మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన వయసు పై పడటంతో ఈయన వయసుకు తగ్గ పాత్రలు లేకపోవడం వల్ల ఈయనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు తద్వారా ఈయన పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు.
అయితే ఇంటికి పరిమితమైనటువంటి కోట శ్రీనివాసరావు పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ చిత్ర పరిశ్రమ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి ఈయన ఇండస్ట్రీలో పలువురు హీరోల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.
ఈ క్రమంలోనే తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కోటా శ్రీనివాసరావు టాలీవుడ్ యంగ్ హీరోలు అయినటువంటి మహేష్ బాబు ఎన్టీఆర్ నాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు అవకాశం ఇస్తే ఇప్పటికి సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కోట పలుమార్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఓ సందర్భంలో తనకు ఎదురవగా తనని తన సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చాన్స్ ఇవ్వమని అడిగాను.నేను ఇలా అడిగేసరికి మహేష్ బాబు మీరు మమ్మల్ని ఇలా చాన్స్ ఇవ్వమని అడగడం ఏంటండీ అంటూ సమాధానం చెప్పారని ఈయన తెలిపారు.మహేష్ బాబు మాత్రమే కాదు ఎన్టీఆర్, నాని ఎదురైనప్పుడు కూడా తనకు ఇలాంటి సమానమే వచ్చిందని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.