కోట శ్రీనివాసరావు ఫ్యామిలీకి ఆ విషయం చెప్పాలి

టాలీవుడ్‌ లో ఎందరో సీనియర్ మోస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు.వారిలో కోట శ్రీనివాస రావు శైలి చాలా విభిన్నం.

 Kota Comments Over Chiranjeevi And Ntr , Kota Srinivasa Rao, Tollywood, Mega Fam-TeluguStop.com

ఆయన కామెడీ పాత్రలు చేశాడు.సీరియస్ పాత్రలు చేశాడు.

విలన్ పాత్రలు చేశాడు.అద్బుతమైన నటనతో ఎంతో మంది హీరోలను కూడా తన అభిమానులుగా మార్చుకున్న కోట శ్రీనివాస రావు వయసు మీద పడే వరకు సినిమాల్లో నటించాడు.

ఆయన నటన కు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్నాడు.కాని ఇప్పుడు కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ తో మాట్లాడుతున్న ఇంటర్వ్యూలు వైరల్‌ అవుతున్నాయి.

ఆమద్య సీనియర్ ఎన్టీఆర్‌ గురించి విమర్శలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు.తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి మరియు ఎన్టీఆర్‌ లను విమర్శించాడు.

చిరంజీవి స్థాయి తగ్గించే విధంగా కోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఎంతో మంది అభిమానంను సొంతం చేసుకున్న కోట శ్రీనివాస రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం అంటూ వారు అసహనంగా ఉన్నారు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ యొక్క పొడవు గురించి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆయన గురించి చర్చ జరుగుతోంది.

ఈ సమయంలో ఆయన గురించి కుటుంబ సభ్యులు కాస్త జాగ్రత్త తీసుకుని మీడియా ముందుకు రాకుండా చూసుకోవాలని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యూట్యూబ్‌ ఛానల్స్ వారు ఆయన ముందు మైక్ పెట్టి రెచ్చ గొట్టే విధంగా ప్రశ్నలు అడుగుతూ ఆయన నుండి వివాదాస్పద వ్యాఖ్యలు రాబట్టుకుంటున్నారు.

ఇది ఎంత మేరకు మంచిది కాదు.ఆయన లెజెండ్‌ కనుక లెజెండ్‌ మాదిరిగా నే ఉండేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి.ఆయన మీడియా ముందుకు వస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కనుక మీడియా కూడా కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube