డబ్బు సంపాదించడమే ధ్యేయంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్.ఆన్‌లైన్ పేరుతో అనేక మోసాలకు తెరతీస్తున్నారు.
వ్యక్తుల మానసిక బలహీనతలే పెట్టుబడిగా కొనసాగిస్తూ… పలు విధాలుగా వారిని బురిడి కొట్టిస్తున్నారు.అయితే ఒకసారి సైబెర్ నేరగాళ్ల చేతిలో ఒకసారి మోసపోయిన వారిపై కొత్త పద్ధతల్లో వల విసురుతున్నట్లు తెలుస్తోంది.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు.వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంటాక్ట్ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.
ఇలాంటివారిని టార్గెట్ చేసుకుంటున్న సైబర్ మాయగాళ్లు ఫేక్ వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్ల ద్వారా మరోసారి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.
సైబర్ బాధితులపై ఫిర్యాదు ఇవ్వడానికి తయారుచేసిన ఫేక్ వెబ్‌సైట్లలో తప్పుడు కాంటాక్ట్ నంబర్లును ఈ మోసగాళ్లు ఉంచుతున్నారు.
దీంతో బాధితులు మరోసారి వారి వలలో చిక్కుకుంటున్నారు.
ఇందుకోసం ఈ క్రింది వెబ్ సైట్లను వారు వినియోగిస్తున్నారు.
www.consumercomplaints.info, www.consumerchanakya.com, www.goindialegal.com, www.janasurakshakendra.in

బాధితులు తాము మోసపోయామని కంప్లైంట్ ఇవ్వడానికి ఈ నకిలీ వెబ్ సైట్లలో ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే.మోసపోయిన సొమ్మును రికవరీ చేస్తామని నమ్మిస్తున్నారు.బాధితుల నుండి వారి బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్, అడ్రస్, ఆధార్ నంబర్, సీవీవీ ఇలా పూర్తి వివరాలను నమ్మకంగా తీసుకుంటున్నారు.ఆ తరువాత వీటిని ఉపయోగించి బాధితుల నుంచి మళ్లీ డబ్బు కొట్టేస్తున్నారు.
కొంత మంది బాధితులు వార్ బ్యాంకు అకౌంట్ డీటైల్స్ ఇచ్చేందుకు అంగీకరించకపోతే.వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు, ఖర్చుల పేరుతో ఇతర ఖర్చుల పేరుతొ దోచుకుంటున్నారు.
కేవలం గడచిన పది రోజుల్లో ఇలాంటి కేసులు ఐదు వరకు నమోదైనట్లు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.ఇలాంటి వారిని ఆన్ లైన్ లో ఆశ్రయించవద్దని, డబ్బులు పోగొట్టుకొన్న బాధితులు 1930 లేదా 155260 నంబర్లలో ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు.







