ఇమ్మ్యూనిటిని పెంచే కొర్ర బియ్యం పొంగల్.. మీరు తిన్నారా?

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.ఈ కాలంలో ఎంతో బలమైన ఆహారం తీసుకోవాలి.

లేదంటే ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది.అందుకే బయటకు వచ్చినప్పుడు కరోనా వైరస్ సోకకుండా ఎలా అయితే మాస్కులు, శానిటైజర్ ధరిస్తున్నారో అలానే ఇంట్లో మంచి బలమైన, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని తింటున్నారు.

మంచి పండ్లను, కూరగాయలను తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకుంటున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీని పెంచే ఓ ఆహారం తెర మీదకు వచ్చింది.

అదే కొర్ర బియ్యం పొంగల్. నిజానికి కొర్ర బియ్యమే మంచి ఇమ్యూనిటీని ప్రసాదిస్తాయి.

Advertisement

అలాంటిది కొర్ర బియ్యం పొంగల్ తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.అందుకే వారానికి ఒకసారైనా ఈ కొర్ర బియ్యం పొంగలి తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెసర పప్పు, కొర్ర బియ్యం, పసుపు, మిరియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు వంటి ఇమ్యూనిటీని పెంచే పదార్దాలతో ఈ వంటకం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, ఇమ్యూనిటీ పెరగడం వల్ల కరోనా వైరస్ రమ్మన్నా రాదని నిపుణులు చెప్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొర్ర బియ్యం పొంగల్ ని తిని ఇమ్యూనిటీని పెంచుకోండి.

Advertisement

తాజా వార్తలు