తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా కొనసాగుతున్నటువంటి కొరటాల(Koratala Siva) కెరియర్లో ఆచార్య(Acharya) సినిమా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి.అప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడుగా మంచి గుర్తింపు పొందినటువంటి ఈయనకు ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు దీంతో తదుపరి సినిమా ఎన్టీఆర్ దేవరపై ఎఫెక్ట్ పడుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య విషయంలో జరిగిన విధంగానే దేవర(Devara) విషయంలో జరగకూడదని భావించినటువంటి కొరటాల ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అదేవిధంగా ఎన్టీఆర్ (NTR)కూడా ఈ సినిమా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఎలాగైనా ఈ సినిమాని హిట్ చేసి కొరటాలపై ఉన్న మచ్చ తొలగించాలన్న ఉద్దేశంలో ఎన్టీఆర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా సెరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమా సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.అదేవిధంగా దివంగత నటి శ్రీదేవి కుమార్తె ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వి కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇక ఈమె ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం దాదాపు సంవత్సరం పాటు ఎదురు చూశాను అని కూడా ఓ సందర్భంలో తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ కి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా ఆడిషన్స్ కి రావాలి అంటే ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వాలి అంటే కొరటాల ఈమెకు ఒకే ఒక కండిషన్ పెట్టారట ఆ కండిషన్ కి ఆమె ఒప్పుకొని అదే విధంగా నడుచుకుంటేనే తనకు ఈ సినిమాలో అవకాశం వస్తుందని కొరటాల తనకు చెప్పారట మరి కొరటాల జాన్వీ కపూర్ కి పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే జాన్వి కపూర్ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో నటించాలి అంటే అలా గ్లామర్ షో చేస్తే సరిపోదని కొరటాల తనకు తెలిపారుట చాలా ట్రెడిషనల్ లుక్ లో ( Traditional Look ) ట్రెడిషనల్ దుస్తులు ధరించి కనిపించాలని తనకు కండిషన్ పెట్టారట ఇలా వీటన్నింటినీ ప్రాక్టీస్ చేసి ఆడిషన్స్ కి రావాలని అక్కడ సెలెక్ట్ అయితేనే ఈ సినిమాలో అవకాశం కల్పిస్తానని తనకు చెప్పారట అయితే ఎలాగైనా ఈ సినిమాలో అవకాశమందుకోవడం కోసం ఈమె ఎంతో కష్టపడి కొరటాలకు నచ్చినట్టే ఆడిషన్ ఇవ్వడంతో చివరికి ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యారు.