రాజమౌళిని ఫాలో అవుతున్న కొరటాల ?

టాలీవుడ్ నెంబర్ ఒన్ డైరెక్టర్ ఎవరంటే.ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) అని టక్కున ఎవరైనా చెప్పేస్తారు.

ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.ప్రస్తుతం ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి ఉన్నారు.

ఈయన నుంచి మూవీ వస్తోందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు.మరి ఇంతటి పేరుగాంచిన దర్శకుడిని ఇతర దర్శకులు ఫాలో కావడం సర్వసాధారణం.

కొందరు రాజమౌళి టేకింగ్ ను ఫాలో అయితే మరికొందరు.

Advertisement

ఆయన స్టైల్ ఆఫ్ విజన్ ను ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.కానీ కొరటాల శివ( Koratala Shiva ) మాత్రం రాజమౌళిని ఇంకో విషయంలో ఫాలో అవుతున్నాడు.సాధారణంగా రాజమౌళి తన సినిమాలలోని స్టోరీ లైన్ ముందే చెప్పేస్తుంటారు.

కెరియర్ మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని పాటిస్తున్నారు రాజమౌళి.విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్.

ఇలా ఆయన చేసిన ప్రతి సినిమాకు సంబందించి మెయిన్ స్టోరీ ముందే చెప్పేస్తుంటారు.ఇలా స్టోరీలోని కీ పాయింట్స్ ను ముందే చెప్పే సాహసం ఏ దర్శకుడు చేయలేడు.

కానీ కొరటాలశివ మాత్రం ఈ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారు.ఆయన దర్శకత్వం వహించిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

వంటి సినిమాల యొక్క స్టోరీ లైన్ ముందే ఆడియన్స్ కు చెప్పారు కొరటాల.

Advertisement

అయితే ఇందులో ఆచార్య తప్పా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే " NTR30 " మూవీ స్టోరీ లైన్ కూడా ముందే చెప్పేశారు కొరటాల శివ.మార్చి 23న పరిగిన పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ 30 మూవీ గురించి కొరటాల శివ చెబుతూ.ఈ మూవీ కోస్టల్ బ్యాక్ డ్రాప్( Coastal back drop ) లో జరిగే కథ అని, భయమంటే ఏమిటో తెలియని మృగలను భయపెట్టే ఒకతని కథ అని మూవీ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు కొరటాల.

ఇలా మూవీ యొక్క మెయిన్ పాయింట్ ఆడియన్స్ కు ముందే చెప్పడం వల్ల.ఆ మూవీ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఓ అంచనా కు రావోచ్చు.అందువల్ల ఆడియన్స్ ఎక్పెర్టేషన్స్ ను దర్శకులు ఈజీగా రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ వంటి వాళ్ళు స్టోరీ లైన్ ముందే చెప్పడానికి ఏదే ప్రధాన కారణం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.మరి రాబోయే రోజుల్లో రాజమౌళి, కొరటాల మాదిరీగానే స్టోరీ లైన్ ముందే చెప్పే దర్శకుల పెరుగుతుందేమో చూడాలి.

తాజా వార్తలు