సాధారణంగా సినిమాల ఫలితాలను దర్శకనిర్మాతలు షూటింగ్ సమయంలోనే ఊహించగలుగుతారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు కాగా ఈ సినిమా ఫలితాన్ని ఆయన ముందుగానే ఊహించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య సినిమా రిలీజ్ కు కొన్ని నెలల ముందే కొరటాల శివ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తాయని భావించి ఆయన ఇలా చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పుడు కూడా కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగానే ఉన్నారు.అయితే ఒక్క ఫ్లాప్ వచ్చినంత మాత్రాన కొరటాల శివను తక్కువగా అంచనా వేయలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొరటాల శివ సినిమాలన్నీ ప్రత్యేకతలతో ఉండేవని రొటీన్ కథాంశాలను ఎంచుకోవడం వల్ల ఆచార్య రిజల్ట్ విషయంలో ఈ విధంగా జరిగి ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తను రాసుకున్న కథను సైతం తెరపైకి అద్భుతంగా తీసుకొనిరావడంలో కొరటాల శివ విఫలమయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరి కొందరు నెటిజన్లు మాత్రం కొరటాల శివ ఫ్లాప్ సినిమా తీయడం ఏమిటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆచార్య రీషూట్లకు సంబంధించిన వార్తలు సైతం ఈ సినిమాకు ఒకింత చేటు చేశాయనే చెప్పాలి.
ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఆచార్య నష్టాల భారం వల్ల చిరంజీవి, చరణ్, కొరటాల శివ రెమ్యునరేషన్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య సినిమాకు సోమవారం రోజున బుకింగ్స్ దారుణంగా ఉండటం గమనార్హం.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అచార్య సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ సినిమాకు టికెట్ రేట్లను మాత్రం తగ్గించకపోవడం గమనార్హం.







