బాలయ్య- ఎన్టీఆర్ కాంబోలో సినిమా! ఆ దర్శకుడు మాట

నందమూరి తారకరామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ స్థాయిలో స్టార్ హీరోలుగా టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య కాలంలో వీరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన హరికృష్ణ మరణం తర్వాత ఒకటయ్యారు.

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాలు అందరూ కలిసి సినిమాలు చేస్తున్న తరుణంలో నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమాలు చేస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా మాస్ హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి ఫాన్స్ కోరుకుంటున్నారు.అయితే ఈ కాంబో ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశం లేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే స్టార్ దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనతా గ్యారేజ్ సినిమాని బాలకృష్ణ, ఎన్టీఆర్ తో చేస్తే బాగుండేది కదా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా, జనతా గ్యారేజ్ సినిమాలో రెండు పాత్రలు ప్రాధాన్యత ఉన్న అదొక సోషల్ ఎలిమెంట్ తో కూడుకున్న సినిమా.

ఎన్టీఅర్, బాలకృష్ణతో ఆ సినిమా చేస్తే ఫాన్స్ అందరూ వాళ్ళిద్దరిని మాత్రమే చూస్తారు.దీంతో కాన్సెప్ట్ రీచ్ కాదు.

Advertisement

అలాగే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదు.వారిద్దరితో సినిమా చేస్తే అది కచ్చితంగా మాస్ కమర్షియల్ సినిమా అయ్యి ఉండాలి.

అలాంటి కథలతో వారు సినిమా చేస్తే బాగుంటుందని తెలిపారు.మరి నందమూరి ఫాన్స్ తో పాటు చాలా మంది కోరుకుంటున్న ఆ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు