ఎన్.టి.ఆర్ కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా విషయంలో ఎక్కడ అనుకున్న ప్లాన్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.దేవర కోసం కొరటాల ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు.
కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ ఆచార్యతో పెద్ద షాక్ ఇచ్చాడు.అయితే ఆచార్య తర్వాత కొరటాల మీద నమ్మకంతో తారక్ దేవర చేస్తున్నాడు.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ దేవర సినిమా( Devara ) కోసం కొరటాల నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడట.
సినిమా గురించి ఎక్కడ లీక్స్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల శివ.సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటాయట.అయితే వాటి గురించి చిత్ర యూనిట్ కూడా ఎక్కడ రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారట.
సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు వెళ్లకుండా సెల్ ఫోన్స్ కూడా లేకుండా షూటింగ్ చేస్తున్నారట.దేవర కొరటాల ప్లానింగ్ చూసి అందరు షాక్ అవుతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను ఏప్రిల్ 5 2024లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో తారక్ తో జాన్వి కపూర్( Janhvi Kapoor ) రొమాన్స్ చేస్తుందని తెలిసిందే.