మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) రైతు నిరసన దీక్ష చేపట్టారు.ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని( Peddapalli District ) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్ష సుమారు 36 గంటల పాటు కొనసాగనుంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిన తరువాత పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులకు కష్టాలే ఎదురవుతున్నాయని ఆరోపించారు.
పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున సర్కార్ రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా రైతులకు( Farmers ) న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు.







