గత కొంతకాలంగా రాజకీయ ఊగిసలాట అవలంభిస్తున్న చేవెళ్ల మాజీ ఎంపీ తెలంగాణ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ అడుగుల పై అందరికీ ఆసక్తి నెలకొంది.ఆర్థికంగా స్థిత మంతుడైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ గా పనిచేశారు.
అనంతరం కాంగ్రెస్ లో చేరారు .ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.తర్వాత ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతూనే వస్తోంది.అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు.దీంతో తిరిగి విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని అంతా భావించారు.
అయితే టిఆర్ఎస్ .ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై ఉన్న ఆ గ్రహం కారణంగా ఆ పార్టీని ఓడించగలిగిన పార్టీలో చేరితే మంచిదే అని భావిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది.
దీనికి మరింత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోనూ అనేక సార్లు విశ్వేశ్వర్ రెడ్డి చర్చలు జరిపారు.దీంతో వీరి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది అని రాజకీయ వర్గాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా విశ్వేశ్వర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం పై ప్రకటన చేశారు.టిఆర్ఎస్ పై బిజెపి బలంగా పోరాటం చేస్తే తనతో పాటు 30 మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంచలన ప్రకటన చేశారు.

దీంతో ఈనెల 14న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు కాబోతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు బిజెపిలో చేరి టిఆర్ఎస్ ఓటమే ధ్యేయంగా పని చేయబోతున్నారనే విషయం అర్థమవుతోంది.దీంతో ఇప్పటి వరకు ఈయన రాజకీయ నిర్ణయం పై అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ , బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు ఎదురుచూపులు చూసినా వాటికి చెక్ పడింది.







