కొణతాల చూపు జనసేన వైపు?

ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నాయకుడైన కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన అనుభవ శాలి గా మంచి పేరు తెచ్చుజకున్నారు .అయితే 2009లో ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ మంత్రిగా ఉంటూ ఆయన ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న ఆయన వైఎస్ఆర్( YSR ) మరణం తర్వాత జగన్కు బాగా దగ్గరయ్యారు.

 Konathala Ramakrishna To Join Janasena,janasena,konathala Ramakrishna,pawan Kaly-TeluguStop.com

ఆయనకు ఉన్న అనుభవాన్ని వైయస్సార్ తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ కీలకమైన నిర్ణయాలుకు ఆయన ఆయన సంప్రదించేవారు .

Telugu Anakapalli Mp, Janasena, Pawan Kalyan-Telugu Political News

అయితే అనేక రాజకీయ సమీకరణాలతో 2014 ఎన్నికల్లో తన సోదరుడిని అనకాపల్లి ఎంపీ( Anakapalli MP )గా నిలబెట్టినప్పటికీ గెలిపించుకోలేక పోయారు .తదనంత పరిమాణతో జగన్కు దూరం జరిగి టిడిపి పంచన చేరి ఆ పార్టీకి ప్రచారం చేసి పెట్టారు.అయితే 2019లో తెలుగుదేశం కూడా విజయం సాధించకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమైన ఆయన సేవా కార్యక్రమాలలో మాత్రం తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

విశాఖపట్నం వేదికగా స్థానికేతరులు వరుసగా విజయం సాధించడంతో స్థానికుడైన ఆయన బాగా వెనకబడిపోవడంతో రాజకీయాలపై అనాసక్తి తో ఉంటున్నారు .అయితే ఇప్పుడు ఆయన చూపు ఇప్పుడు జనసేనపై పడింది అంటున్నారు .

Telugu Anakapalli Mp, Janasena, Pawan Kalyan-Telugu Political News

జనసేన టికెట్ ద్వారా అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారని ఈ దిశగా ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) తో ఇప్పటికే సమావేశమై రాజకీయ కార్యాచరణ పై చర్చించారని వార్తలు వస్తున్నాయి.వివాద రహితుడుగా పేరున్న కొణతాల సమర్ధుడైన మంత్రిగా కూడా పేరు తెచ్చుకోవడంతో ఇలాంటి కీలక నాయకుడు తమ వైపునుంటే పార్టీకి మంచి జరుగుతుందని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కు పార్టీలో చేరడానికి స్వాగతం పలుకుతున్నారని సమాచారం.అయితే క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ రావాలా వద్దన్నా మీమాంస కూడా ఉన్న కొణతాల తన అనుచరులతో నిర్ణయించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube