ఉత్తరాంధ్ర( Uttarandhra ) మీద వైసిపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు.అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Rama Krishna ) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హాయాంలో పోలవరం ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు.గడిచిన ఐదేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి పనులకు నోచుకోలేదని ప్రభుత్వాన్ని హేళన చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు.గడచిన ఐదేళ్లలో బడ్జెట్లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు 3285 కోట్లు కేటాయించగా కేవలం 594 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన నిధులు దారి మళ్లించారని విమర్శించారు.
వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న అనకాపల్లి ప్రాంతంలో 11 గ్రోయన్లు ఉన్నాయని, వాటి పై 10 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, పరోక్షంగా మరో 10 వేల ఆయకట్టు ఉన్నా గత ఐదేళ్లలో గోయన్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయమని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి పై శ్వేత పత్రం వెంటనే విడుదల చేయాలని అన్నారు.
జనసేన, టీడీపి ( Janasena, TDP )కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చేతికి పని, ప్రతి ఎకరానికి నీరు అందజేస్తామని, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.