టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లలో కోన వెంకట్( Kona Venkat ) ఒకరనే సంగతి తెలిసిందే.కోన వెంకట్ నిర్మాతగా మారి వరుసగా సినిమాలను నిర్మిస్తూ ఆ సినిమాలతో కూడా విజయాలను అందుకుంటున్నారు.
కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి, అదుర్స్ సీక్వెల్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.అదుర్స్ సినిమాలో చారి రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన స్థాయిలో ఎవరూ చేయలేరని కోన వెంకట్ అన్నారు.
అదుర్స్ సినిమా( Adhurs )కు సీక్వెల్ తీసుకొనిరావాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.అదుర్స్ మూవీ సీక్వెల్ కథ రాసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసి అయినా సరే ఆ సినిమాలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొస్తానని కోన వెంకట్ కామెంట్లు చేయడం గమనార్హం.

అదుర్స్ సీక్వెల్( Adhurs Movie Sequuel ) కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వి.వి.వినాయక్ మాత్రం ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగిందని తారక్ తో అదుర్స్ సీక్వెల్ తెరకెక్కించడం సులువు కాదని చెప్పుకొచ్చారు.అదుర్స్ సీక్వెల్ తెరకెక్కితే ఆ సినిమాకు వినాయక్( VV Vinayak ) దర్శకత్వం వహిస్తారో లేక టాలెంట్ ఉన్న మరో దర్శకుడు దర్శకత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరోవైపు దేవర మూవీ( Devara Songs ) సాంగ్స్ విన్నానని ఈ సాంగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన విశ్వక్ సేన్( Vishwak Sen ) ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.దేవరపై విశ్వక్ సేన్ కామెంట్లతో అంచనాలు మరింత పెరిగాయి.అక్టోబర్ నెల 10వ తేదీన దేవర రిలీజ్ కానుంది.







