కొమొడో డ్రాగన్ vs గేదె.. గెలుపెవరిది? వైరల్ వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పలుమార్లు అడవి జంతువుల వీడియోలు విపరీతంగా వైరల్( Viral Video ) అవుతున్నాయి.

అడవుల్లో సహజంగా జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనలు, అరుదైన జంతువుల కదలికలు, మృగరాజుల వేట దృశ్యాలు వంటి అనేక రకాల వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రత్యేకించి మనుషుల సమీపానికి వచ్చే వన్యప్రాణులు, వింతగా ప్రవర్తించే జంతువుల వీడియోలు మరింత ట్రెండింగ్‌గా మారుతున్నాయి.ఇవన్నీ మానవజాతి, ప్రకృతి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఓ ఆసక్తికరమైన వీడియో గురించి చూద్దాం.

Komodo Dragon Vs Buffalo Viral Video

నిజానికి కొమొడో డ్రాగన్( Komodo Dragon ) ఎంతటి శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇది పెద్దపెద్ద జంతువులను కూడా ఎదురుగా మింగేయగలదు.పందులు, జింకలు వంటి జంతువులను తినేస్తూ షాకింగ్ ఘటనలను సృష్టించడం సాధారణమే.

Advertisement
Komodo Dragon Vs Buffalo Viral Video-కొమొడో డ్రాగన్ V

ఇలాంటి ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.తాజాగా, ఓ కొమొడో డ్రాగన్ గేదెలపై( Buffalo ) దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఒక ప్రాంతంలో గేదెలు గడ్డి మేస్తుండగా, ఓ కొమొడో డ్రాగన్ వేట కోసం ఎదురు చూస్తోంది.

Komodo Dragon Vs Buffalo Viral Video

గేదెలను గమనించిన వెంటనే దాడి చేయడానికి సిద్ధమైంది.అయితే కొమొడో డ్రాగన్ గేదె వద్దకు చేరగానే, అది అప్రమత్తమైంది.వెంటనే కొమొడోపై ఎదురుదాడి చేసింది.

కొమ్ములతో కొమొడోపై విరుచుకుపడింది.దెబ్బకు కొమొడో వెనుకడుగువేసింది.

కోర్ట్ మూవీ ఐదు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినట్టేనా?
సందీప్ రెడ్డి వంగా డైరక్షన్ లో మిస్టర్ కూల్.. అదిరిపోయిందగా!

అయినప్పటికీ కొంత సేపటి తర్వాత మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించింది.కానీ, గేదె తన బలాన్ని ప్రదర్శిస్తూ మరింత తీవ్రంగా కొమొడోపై దాడి చేసింది.

Advertisement

దాంతో కొమొడో డ్రాగన్ ఇక అక్కడ ఉండలేక పారిపోయింది.ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.నెటిజన్లు కూడా ఈ వీడియోపై భారీగా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు