తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలకు దగ్గర అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఒక పార్టీని మరొక పార్టీ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి సరిగా ఈ సమయంలోనే.రాజకీయ విద్యుత్ మంటలు రాజుకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) అమెరికాలో సందర్భంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ , బీఆర్ఎస్ నాయకులంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు.
ఈ వ్యాఖ్యలను జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, దానిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది.ఈ మేరకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.

తెలంగాణలో వ్యవసాయానికి 11 గంటలు మించి విద్యుత్ సరఫరా ఉన్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy venkatareddy ) చాలెంజ్ చేశారు.రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అనేది పచ్చి అబద్ధం అని, 11 గంటలు విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.ఆ 11 కరెంటు సరఫరా లోను కోతలు విధిస్తున్నారని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేసుకుని కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే విధంగా బిఆర్ఎఫ్ వ్యూహాలు రచిస్తూ ఉండగా, అంతే స్థాయిలో కాంగ్రెస్ కూడా ఎదురు దాడికి దిగుతూ ఈ తరహా విమర్శలు బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS party ) పై చేస్తూ సవాళ్ళను విసురుతోంది.
ఇదే విషయంపై కాంగ్రెస్ లోనూ భిన్నభిప్రాయాలు ఉన్నాయి.

ఇప్పుడు ఇప్పుడే కాంగ్రెస్ తెలంగాణలో బలం పెంచుకుంటుంది అనుకుంటున్న సమయంలో రేవంత్ అనవసరంగా ఈ వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యల ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో కనిపిస్తుందని కొంతమంది నేతలు ఆందోళన చెందుతున్నారు.ఇక రేవంత్ రెడ్డి అమెరికా నుంచి తిరిగి వస్తుండడంతో ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించి బిఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.







