Theri Soorarai Pottru : కోలీవుడ్ కథలకు హిందీ లో ఫుల్ డిమాండ్..ఎన్ని రీమేక్ అవుతున్నాయో తెలుసా ?

ఒకప్పుడు తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉండేది.ఇప్పటికి కూడా ఉంది.

 Kollywood Remakes In Hindi-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో హిందీ సినిమాల రూటు మారుతుంది.కోలీవుడ్ కథలను చాల జాగ్రత్తగా గమనిస్తూ మంచి సినిమా వస్తే చాలు రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

మరి ముఖ్యంగా మన తెలుగు వారు ఏ సినిమా తీసిన ఫ్యాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు కాబట్టి రీమేక్ చేసే అవకాశం హిందీ వారికి ఉండదు.అందుకే వారి చూపు తమిళ దర్శకులు మరియు కథలపై పడింది.ఈ మధ్య కాలంలో కోలీవుడ్ కథలను హిందీ బాగా రీమేక్ చేస్తుంది అవేంటో చూద్దాం.

సూరరై పోట్రు

Telugu Akshay Kumar, Amy Jackson, Atlee, Comali, Hindi, Kollywood, Samantha, The

సూరరై పోట్రు అనే సినిమా తెలుగు లో ఆకాశమే నీ హద్దురా అని విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది.ఇందులో సూర్య నటన తో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, యాక్షన్ అన్ని బాగా వర్క్ అవుట్ అవ్వడంతో జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకుంది.ఇప్పుడు ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది.

సుధా కొంగర దర్శకత్వంలో అక్షయ్ కుమార్( Akshay Kumar ) హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

తేరి

Telugu Akshay Kumar, Amy Jackson, Atlee, Comali, Hindi, Kollywood, Samantha, The

అట్లీ ఇప్పటికే జవాన్ తో సక్సెస్ కొట్టారు.అంతకన్నా ముందు తమిళ్ లో విజయ్ హీరో గా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన తేరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దాంతో ఈ చిత్రాన్ని వరుణ్ ధావన్ హీరో( Varun Dhawa ) గా హిందీ లో తెరకెక్కిస్తున్నారు.

లవ్ టుడే

చిన్న సినిమా అయినా ఒక్కసారి యూత్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా లవ్ టుడే( Love Today ).ఈ సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందీలో జునైద్ ఖాన్ హీరోగా, శ్రీదేవి చిన్న కూతురితో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.

కోమాలి

జయం రవి హీరో గా వచ్చిన కోమాలి సినిమా కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది.ఇప్పుడు ఇదే చిత్రాన్ని అర్జున్ కపూర్ హీరోగా హిందీ లో తెరకెక్కిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube