కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటుడు మన్సూర్ అలీ ఖాన్ల ( Mansoor Ali Khan )వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.రోజురోజుకీ ఈ వ్యవహారం ఇంకా ముదురుతూనే ఉంది.
ఒక బేటి లో మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.ఇక మనసూర్ అలీ ఖాన్ పై టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ వ్యవహారంపై కుష్బూ, మాళవిక నాయర్, లియో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటి రోజా( Lokesh Kanakaraj , Roja ), దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు మద్దతుగా నిలిచారు.
త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.ఇక ఈ వ్యవహారం మరింత ముదురుతుండడంతో ఆ విషయం పై స్పందించిన మన్సూర్ అలీ ఖాన్ నేను సరదాగా అన్నాను దానిని వివాదాస్పదం చేయవద్దు అని కోరారు.తనపై రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
అయితే త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ( South Indian Actors Association )కోరితే తాను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు మన్సూర్.
దీంతో ఆయనపై మూకుమ్మడి ఒత్తిడి వస్తోంది.మన్సూర్ అలీఖాన్‌పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఆయనపై రెడ్ కార్డ్( Red card ) వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
కాగా ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్లింది.
త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై 509 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఫిర్యాదు చేసింది.చూస్తుంటే ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో కూడా అర్థం కావడం లేదు.అయితే త్రిషకు అన్ని ఇండస్ట్రీలో సెలబ్రిటీల నుంచి ఈ మద్దతు లభిస్తోంది.
అభిమానులు కూడా అతన్ని దారుణంగా శిక్షించాలి మళ్లీ ఇంకొకసారి అలా మాట్లాడకుండా శిక్ష వేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.