సీబీఐ విచారణకు హాజరైన కోలీవుడ్ హీరో విశాల్..!!

కోలీవుడ్ హీరో విశాల్( Vishal ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తమిళ నిర్మాత మండల అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు సంచలనాలు సృష్టించాయి.

ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తూనే మరోపక్క ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటారు.విశాల్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఆయన నటించిన "పందెంకోడి"( Pandem Kodi ) సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది.విశాల్ తమిళ్ లో చేసే చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి.

ఈ క్రమంలో విశాల్ తన ట్విటర్ ఎకౌంట్ లో సంచలన పోస్ట్ పెట్టారు.ముంబైలో సీబీఐ కార్యాలయానికి వెళ్ళినట్లు స్పష్టం చేశారు.

Advertisement

తన జీవితంలో సీబీఐ విచారణకు( CBI ) వెళ్తానని ఒక్కసారి కూడా అనుకోలేదు.తాను నటించిన "మార్క్ ఆంటోనీ"( Mark Antony ) హిందీ సెన్సార్ కోసం లంచం అడిగినట్లు అప్పట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముంబై సెన్సార్ బోర్డు పై కేసు నమోదు చేయడం జరిగింది.

ఆ సమయంలో మధ్యవర్తులతో పాటు ముంబై సిబిఎఫ్సీ కి( CBFC ) చెందిన అధికారులను కూడా విచారించారు.ఆ తర్వాత "మార్క్ ఆంటోనీ" సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది.

అంతటితో వివాదం సద్దుమణిగింది అనుకున్నారంతా.కానీ ఇప్పుడు విశాల్ నీ కూడా.

సీబీఐ విచారించటం సంచలనం సృష్టించింది.ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా విషయాలు తెలియజేశారు.

ప్రధాని మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు..!!
Advertisement

తాజా వార్తలు