దేవుడా..ఒక్క ప్లాప్ అయినా ఇచ్చి నన్ను నెల మీద నడిచేలా చేయు అంటూ మొక్కిన దర్శకుడు

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్లి అక్కడ చాలా కష్టాలు పడి తిని, తినక పస్తులు ఉండి చాలా రోజులు తిరిగి మొత్తానికి ఏదో ఒక చిన్న అవకాశాన్ని దక్కించుకునేవారు.

అలా వచ్చిన అవకాశాలతో నటనలో రాణిస్తూ ముందుకు దూసుకుపోయేవారు.

అదే దర్శకత్వ విభాగంలో పనిచేసేవారైతే వారి పనిలో నిమగ్నమై పనిచేస్తూ ముందుకు దూసుకెళ్లేవారు అలాంటి వారే కోదండరామి రెడ్డి గారు ఆయన హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, ఆ తర్వాత దర్శకుడిగా గుర్తింపు పొంది అనతికాలంలోనే అగ్ర దర్శకుడు గా మారి మంచి గుర్తింపును పొందారు.

ఆయన చిరంజీవి తో చేసిన అభిలాష, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఖైదీ, గుండా, రాక్షసుడు, చాలెంజ్, ముఠామేస్త్రి లాంటి సినిమాలతో అప్పటివరకు సుప్రీం హీరో గా ఉన్న చిరంజీవినీ ఒకసారి గా మెగాస్టార్ గా మార్చేశాడు.ఎవరు ఎన్ని చెప్పినా చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన ఘనత మాత్రం కోదండరామిరెడ్డి గారిదే అప్పటి వరకు మాస్ హీరో మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి చేత ఒక్క ఫైట్ కూడా లేకుండా ఎమోషనల్ గా సాగే విజేత సినిమాను తీసి మంచి హిట్ సాధించారు కోదండరామి రెడ్డి గారు.ఇదిలా ఉంటే ఆయనకి ఎన్టీఆర్ గారి నుంచి చాలా సినిమాలు చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ వలన ఆయనతో సినిమా చేయలేకపోయారు.

1986, 87, 88 సంవత్సరాలలో ఆయన తీసిన సినిమాలన్నీ వరుసగా విజయం సాధించడంతో ప్రొడ్యూసర్లు ఇంటి ముందు సూట్ కేస్ బాక్సులతో క్యూ కట్టారట, అలాంటప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఒక ఫ్లాప్ ఇచ్చి నన్ను నేలమీద నడిచేట్టు చేయి స్వామి అని వేడుకున్నారు అని తనే స్వయంగా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఎన్టీఆర్ గారిని ప్రత్యేకంగా డైరెక్షన్ చేసే అవకాశం రాలేదు కానీ అప్పట్లో రాఘవేంద్రరావు గారి దగ్గర కో-డైరెక్టర్ గా పని చేసినప్పుడు రాఘవేంద్రరావు బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమానీ రాఘవేంద్ర రావు తనకి అప్పగించి షూట్ చేయమనడంతో తనకి ఎన్టీఆర్ గారిని డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు.

Advertisement

అయితే తను బిజీగా ఉన్న సమయంలో హీరో మోహన్ బాబు కూడా ఒక సినిమా చేయమని అడిగాడని కానీ తనకు వీలు కాదు అని చెప్పాడు అని కోదండరాం రెడ్డి గారు చెప్పారు.అప్పట్లో అందాల తార శ్రీదేవి కూడా బాలీవుడ్ లో చాలామంది ప్రొడ్యూసర్ లతో చెప్పి కోదండరామ్ రెడ్డి గారితో బాలీవుడ్ లో సినిమా చేయించుకోండి అని చెప్పినప్పటికీ తను బిజీగా ఉండడం వల్ల బాలీవుడ్ లో సినిమాలు చేయలేకపోయాను అని కూడా చెప్పాడు.అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా ఒకటి మాత్రం బాలీవుడ్ లో రీమేక్ చేశారు.

జితేంద్ర లాంటి హీరో సైతం మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెయిట్ చేస్తాను అని కోదండరాంరెడ్డితో స్వయంగా చెప్పినప్పటికీ తను ఉన్న పరిస్థితిలో వాళ్ళతో సినిమాలు చేయలేకపోయాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం తనకి మళ్లీ అవకాశం వస్తే కొన్ని సినిమాలను డైరెక్షన్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు అలాగే అగ్రహీరోలతో కాకుండా ఇప్పుడు ఉన్న చిన్న హీరోలతో కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి తను ఎప్పుడూ రెడీ గా ఉంటాను అని కూడా చెప్పాడు.

కోదండరామ్ రెడ్డి పెద్ద కొడుకు అయిన సునీల్ రెడ్డి బిజినెస్ లో బిజీగా ఉండగా, తన చిన్న కొడుకు అయిన వైభవ్ మాత్రం సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపును సాధిస్తున్నాడు.తెలుగులో మొదటగా గొడవ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వైభవ్.

ఆ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకుడు.ఆ తర్వాత నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కాస్కో సినిమా చేసినప్పటికీ అది పెద్దగా సక్సెస్ కాలేదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం తమిళంలో మంచి గుర్తింపు ఉన్న హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు