నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి...? పవన్ పై కొడాలి నాని ఫైర్ !

కోనసీమ జిల్లా ను అంబేద్కర్ జిల్లా గా మార్చడం పై చెలరేగిన చిచ్చు పై రాజకీయ పార్టీలు రకరకాలుగా స్పందిస్తున్నాయి.ముఖ్యంగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం పై జనసేన , తెలుగుదేశం బిజెపి , కాంగ్రెస్ వంటి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

 Kodali Nani Sensational Comments On Pavan Kalyan , Konaseema Dristict, Konaseema-TeluguStop.com

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడాన్ని ఏ పార్టీ తప్పు పట్టకపోయినా, ఈ వ్యవహారంలో ఏదోరకంగా ప్రభుత్వాన్ని విమర్శించి తమ పార్టీకి రాజకీయ మైలేజ్ పెంచుకునే విషయంపైనే అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో పూర్తిగా జనసేన పాత్ర ఉందని, ఆ పార్టీ తమ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ దమనకాండకు పాల్పడిందని వైసీపీ విమర్శలు చేస్తోంది.

ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్పందించి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.ఏపీలో ఇతర జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో 30 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే సమయం ఇవ్వలేదని , కానీ కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఈ వెసులుబాటు ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని పవన్ చేసిన విమర్శలను వైసిపి సీరియస్ గా తీసుకుంది.
  ఇప్పటికే ఈ వ్యవహారంపై వైసీపీ మంత్రులు,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి విమర్శలు చేశారు.తాజాగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ వ్యవహారంపై స్పందించారు.

గుడివాడ నియోజకవర్గ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ తీరును తప్పు పట్టారు.పవన్ ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతున్నాడని, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుంది అని మండిపడ్డారు.

అంబేద్కర్ ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని, చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని సూచించారు.నిక్కర్లు వేసుకుని పిల్లలను తీసుకువచ్చి పవన్ రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు అని నాని మండిపడ్డారు.
 

Telugu Jagan, Janasena, Kodalinani, Pavan Kalyan, Ysrcp-Politics

అంబేత్కర్ఒక వ్యక్తి కాదని , భారత రత్న అందరివాడు అని చెప్పారు.అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి ,ఎమ్మెల్యే, ఇల్లు రక్షణ పై కంటే గొడవలు ఆపి ఎవరిని గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు.మంత్రి విశ్వరూప్ ఇల్లు దహనం సైతం వైసీపీ నేతలు చేశారంటూ పవన్ మాట్లాడడం పై ఇప్పటికే వైసీపీ మంత్రులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలతో ఈ వ్యవహారం పై మరింతగా జనసేన పార్టీ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube