కోవర్ట్ రాజకీయాలనేవి అన్ని పార్టీల్లోనూ సహజంగా జరిగేవే.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వలస వస్తు ఉంటారు.
అందులో చాలామంది కోవర్ట్ నాయకులు ఉంటారు.తాము చేరిన పార్టీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తాము రాజీనామా చేసిన పార్టీకి అందిస్తూ, కొత్తగా చేరిన పార్టీకి నష్టం చేస్తూ ఉంటారు.
ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియగా రాజకీయాల్లో మారిపోయింది.గతంలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం సైతం ఈ కోవర్టు రాజకీయాలు కారణంగానే పూర్తిగా ఉనికి కోల్పోయి, చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావలసి వచ్చింది. అయితే ఇప్పుడు అదే భయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోను మొదలైంది.తమ పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని, దయచేసి వారంతా బయటకు వెళ్లిపోవాలని పవన్ బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపారు.
జనసేన పార్టీకి కోవర్ట్ ల బెడద ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో ఉంది.గత ఎన్నికల్లో టికెట్లు తీసుకున్న వారు ఎక్కువమంది ఇతర పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల్లో సైలెంట్ అయిపోయారు.దీంతో జనసేన అభ్యర్థులు చాలా చోట్ల ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
ఫలితంగా జనసేనకు ఘోరమైన ఫలితాలు వచ్చాయి.అదే సమయంలో జనసేన ను వీడి చాలామంది అధికార పార్టీ వైసీపీలో చేరిపోయారు.
ప్రస్తుతం వైసీపీ లోని కొంతమంది నాయకులు తమ పార్టీ నేతల తీరుపై వీడియోలు పోస్టింగ్స్ పెడుతూ కాక రేప్ ప్రయత్నం చేస్తుండడం వంటి విషయాలను పవన్ సీరియస్ గా తీసుకున్నారు.

అసలు పార్టీలో కోవర్ట్ లు లేరు అనే విషయంలో పవన్ కు ఒక అవగాహన ఉంది.అయినా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు పవన్ ఇంకా వేచి చూసే ధోరణి ఆలంబిస్తున్నారు.కోవర్టులు వారికి వారి పార్టీని వీడి వెళ్తే మంచిదనే అభిప్రాయంలో పవన్ ఉన్నారు.
అలాకాకుండా తామే సస్పెన్షన్ కార్యక్రమాలకు తెర తీస్తే పార్టీలో అలజడి రేగుతుందనే భయమూ పవన్ లో ఉందట.
.






