సెప్టెంబర్ నెల ముగియనుంది.త్వరలో కొత్త నెలకి స్వాగతం పలకబోతున్నాం.
నెలే కదాని చాలామంది తేలికగా మర్చిపోతుంటారు.కానీ కొంతమందికి ప్రతీ ఒక్క నెల కూడా ఎంతో అమూల్యమైనది.
అవును, ఈ అక్టోబర్ ( October ) ప్రారంభంలో అనేక ఆర్థిక నియమాలలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి.ఇది సామాన్య ప్రజల( Common People ) జేబులపై ప్రభావం చూపనుందండోయ్.
వచ్చే నెల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, స్పెషల్ ఎఫ్‌డీ తదితర అనేక నిబంధనలలో మార్పులు రానున్నాయి మరి.అక్టోబర్ 1, 2023 నుండి క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన ముఖ్యమైన నియమంలో మార్పు రాబోతోంది.దాని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.

అవును, అక్టోబర్ నుండి, కొత్త క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లను కొనుగోలు చేసేటప్పుడు, కస్టమర్‌లు తమ కార్డుకి సంబంధించిన నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను( Network Provider ) ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు.తద్వారా కస్టమర్లు క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను తీసుకునేటప్పుడు మరింత స్వేచ్ఛను అనుభవించగలరు.పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్( Indian Bank ) తన కస్టమర్ల కోసం ‘ఇండ్ సూపర్ 400’ మరియు ‘ఇండ్ సుప్రీం 300 డేస్’ పేరుతో ప్రత్యేక FDలను ప్రారంభించింది, దీని గడువు అక్టోబర్ 31, 2023 వరకు పొడిగించబడింది.

అదేవిధంగా IDBI బ్యాంక్ కస్టమర్ల కోసం అమృత్ మహోత్సవ్( Amrith Mahotsav ) పేరుతో ప్రత్యేక FD పథకాన్ని ఒకదానిని ప్రారంభించింది.ఈ పథకం కింద, కస్టమర్లకు సాధారణ FD కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది మరి.ఈ పథకం మొత్తం 375 మరియు 444 రోజుల ప్రత్యేక FD.ఈ FD గడువు అక్టోబర్ 31, 2023తో ముగుస్తుంది.కాబట్టి ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక నెల మాత్రమే మిగిలి ఉందని గ్రహించుకోవాలి.అదేవిధంగా అక్టోబర్ 1 నుండి TCS నియమాలలో పెద్ద మార్పు రాబోతోంది.విదేశాలకు మీరు వెళ్లేందుకు రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 20 శాతం వరకు టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.ఇక మీరు LIC పాలసీ హోల్డర్ అయితే మరియు మీ బీమా పాలసీలలో ఏదైనా ల్యాప్ అయినట్లయితే, దాన్ని పునఃప్రారంభించేందుకు మీకు ఇదే మంచి అవకాశం.







