నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.
ప్రజలకు ఉన్న వజ్రాయుధం ఓటన్న సీఎం కేసీఆర్ ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని చెప్పారు.అన్నీ ఆలోచించి, సరైన పార్టీకి ఓటేయ్యాలన్నారు.
అభ్యర్థులు మరియు పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటేయాలని సూచించారు.ఏ పార్టీ గెలిస్తే లాభమో చూడాలన్నారు.
దళితుల కోసం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.గతంలో ప్రతీ పార్టీ దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు.
ఈ క్రమంలోనే రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న ఆయన కాంగ్రెస్ నేతలకు రైతులు భిక్షగాళ్లలాగా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు.బీఆర్ఎస్ పాలనలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందుతోందన్నారు.
అలాగే రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.