స్పేస్‌ సూట్లు, ఆస్ట్రోనాట్లు ఆ రంగుల దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

అప్పుడప్పుడూ అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్లు( Astronauts ) వెళ్లి రావడాన్ని మీరు గమనించే వుంటారు.యూరీ గగారిన్‌ నుంచి అనేక మంది అంతరిక్షంలోకి( Space ) వెళ్లిన సంగతి మీరు చదువుకున్నారు.

 Know The Difference Between Orange And White Astronaut Suits Details, Latest New-TeluguStop.com

పలు దేశాలు వివిధ పనుల నిమిత్తం ఆస్ట్రోనాట్లను స్పేస్‌లోకి పంపుతున్నాయి.ఏ దేశం అలా పంపినా వారు ధరించే సూట్లు మాత్రం మనకు కేవలం రెండే రెండు రంగుల్లోనే కనిపిస్తాయి.

అయితే తెలుపు లేదా ఆరెంజ్‌.కొంతమంది పసుపు రంగు సూట్‌ కూడా ధరిస్తారు అనుకోండి.

మరి మీకెప్పుడైనా ఇలాంటి అనుమానం వచ్చిందా? వారు తెలుపు, ఆరంజ్‌ రంగుల్లో ఉండే స్పేస్‌ సూట్లనే ఎందుకు ధరిస్తారు అని? అయితే ఇది ఒకసారి చదవండి.

Telugu Astronauts, Escape Suit, Eva Suit, Latest, Orangeastronaut, Pressure Suit

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఎక్కువగా తెలుపు, ఆరంజ్‌ రంగుల్లో( Orange Color ) ఉండే స్పేస్‌ సూట్‌లనే ధరిస్తున్నారు.కేవలం ఈ రంగుల్లో ఉండే స్పేస్‌ సూట్‌లనే( Space Suit ) ఎందుకు ధరిస్తున్నారంటే ఆరంజ్‌ సూట్‌ ని అడ్వాన్స్‌డ్‌ క్రూ ఎస్కేప్‌ సూట్‌ అని పిలుస్తారు.ఇంకా పంప్కిన్‌ సూట్‌ (గుమ్మడి రంగు) అని కూడా సంబోధిస్తూ ఉంటారు.

దీనిని ప్రెజర్‌ సూట్‌గా వ్యవహరిస్తారు.అంతరిక్షంలో గాలి ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్లే సమయంలో, ప్రెజర్‌ తక్కువగా ఉండే ఎత్తుకు వెళ్లే పైలట్లకు ఒత్తిడితో కూడిన సూట్‌లు అవసరం అవుతాయి.

అందుకే వారు పాక్షిక–పీడన సూట్‌ను ధరిస్తారు.అయితే అంతరిక్ష సిబ్బంది మాత్రం పూర్తి ప్రెజర్‌ సూట్‌ను ధరిస్తారు.

Telugu Astronauts, Escape Suit, Eva Suit, Latest, Orangeastronaut, Pressure Suit

అదేవిధంగా వ్యోమనౌక ప్రయోగించే సమయంలో లేదా ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదాల నుంచి వారిని కాపాడేందుకు, వారిని గుర్తించేందుకు వీలుగా ఉండడానికి ఆరంజ్‌ రంగు ఎంతగానో సహకరిస్తుంది.ఇందులోనే రేడియో, ఫ్లేర్స్, సర్వైవల్‌ గేర్‌ తో పాటు మెడిసిన్స్, పారాచూట్‌తోపాటు మరికొన్ని ఫీచర్స్‌ని కూడా కలిగి ఉంటుంది.స్పేస్‌ లో ఉన్నప్పుడు ఆరంజ్‌ మరియు తెలుపు రంగులను గుర్తించడం, వెంటనే వారిని గుర్తించి కాపాడడం తేలిక అవుతుంది.అందుకే ఈ రంగులని ధరిస్తారు.తెలుపు రంగు సూట్లను( White Color ) ధరించడానికి మరో కారణం కూడా ఉంది.తెలుపు రంగు సూట్‌ లను ఈవీఏ సూట్‌ అని పేర్కొంటారు.

తెలుపు రంగు ఇతర రంగుల కంటే ఎక్కువ వేడిని ప్రతిఘటిస్తుంది.వ్యోమగామి అంతరిక్షంలో ఎక్కువ ఉష్ణానికి గురి అవకుండా ఉంటారన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube