దుబాయ్( Dubai ) దేశం గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా బలమైన కరెన్సీ వున్న దేశం దుబాయ్.
అందుకే ప్రతి ఏటా దేశదేశాలనుండి అక్కడికి వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.అంతేకాదండోయ్ ఎత్తైన, అందమైన ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు దుబాయ్.
అక్కడి ప్రతి ఒక్క కట్టడం ఒక అద్భుతం అని చెప్పుకోక తప్పదు.అవును, అక్కడ మరో అద్భుత ఆవిష్కారానికి నాంది పలుకుతోంది.
సౌదీ అరేబియాలోని ఇంతకు మునుపుకంటే ప్రస్తుతం ఉన్నతంగా ఒక లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు.అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబరా రిసార్ట్ ను రూపొందిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ హోటల్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సౌదీకి చెందిన RSG (రెడ్ సీ గ్లోబల్) సంస్థ విడుదల చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.సముద్ర గుర్రం ఆకారంలో ఉన్న దీన్ని 2024 నాటికి ప్రజలకు అందుబాటులోకి తెరిచేందుకు సిద్ధంగా ఉంది.అలాగే మెగా-ప్రాజెక్ట్ ది రెడ్ సీ( Red Sea Project )లో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే.హైపర్-లగ్జరీ రిసార్ట్ దేశంలో పర్యాటక ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
దుబాయ్‌కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది.

ఈ రిసార్ట్‌లో, పగడపు దిబ్బల పైన ఉండేలా LEED-ప్లాటినం భవనం నిర్మిస్తోంది.“ఏరియల్ అకామడేషన్ పాడ్స్” అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్రమనే స్వర్గంలో ఉన్నట్టు అనుభవాన్ని ఇస్తాయట.పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్‌తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాం( Solar Desalination Plant )ట్‌ను ఉపయోగిస్తోంది.
ఆకాశం, సముద్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ షేబరా ఆర్బ్స్ నీటిపై తేలుతున్నట్టు కనబడుతునని.షేబరా హోటల్ 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్‌లైన్ క్రింద ఉన్న పగడపు దిబ్బలుచూస్తే దిమ్మ తిరగాల్సిందే.
ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనున్నాయి.రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్‌లెస్-స్టీల్ ఆర్బ్‌లతో చాలా అద్భుతంగా రూపొందించారు.నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి రావాలని, ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను ఆస్వాదించాలని పర్యాటకులు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.







