తెలంగాణ బిజేపి నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కి లేఖ రాశాడు.అందులో ఎంఎంటిఎస్ విస్తరణకు రావాలిసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరాడు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 789 కోట్లు ఖర్చు చేసిందని తెలిపాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి 544.36 కోట్లు రావలిసి ఉంది.అయితే అందులో 129 కోట్లు మాత్రమే అందించింది.ఇంకా 414 కోట్లు రావాలిసి ఉంది అని అన్నాడు.ఆ నిధిని వెంటనే విడుదల చేసి ఎంఎంటిఎస్ విస్తరణ పనులు ప్రారంభించాలని కోరాడు.యదాద్రి వరకు ఎంఎంటిఎస్ వెళ్ళే విధంగా కార్యాచరణ చెపట్టాలని సూచించాడు.
పనులు ఆలస్యం అవ్వుతే ప్రాజెక్ట్స్ పై అధిక భారం పడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నాడు.పెండింగ్ లో ఉన్న కారణంగ రూ.951 కోట్లకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం 634 కోట్లు, రైల్వే శాఖ 317 కోట్ల వరకు ఖర్చు చెయ్యవలిసి ఉంటుందని కేసిఆర్ కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొనట్లుగా సమాచారం.కేంద్రం నుండి ఎలాంటి సాయం కావాలన్న చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నాని తెలిపాడు.
యదాద్రిలో లక్ష్మి నరసింహా స్వామి ఆలయం పునర్ నిర్మాణం కారణంగ ప్రజల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంఎంటిఎస్ విస్తరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిందని తెలిపాడు.