ఇవేవీ కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదా ? 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) అనుకున్నంత స్థాయిలో తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

దీనికి కారణం కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం, పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నా, అసంతృప్తితో రగిలిపోతున్నా  వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగే విధంగా చేయడంలో కిషన్ రెడ్డి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం వంటివన్నీ చర్చనీయాంశం గా మారాయి.

అసలు తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం కిషన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని,  తనకు ఇష్టం లేని పదవిలో కూర్చోబెట్టడంపై కిషన్ రెడ్డి అలక చెందారని,  అందుకే పార్టీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy ) మళ్ళీ కాంగ్రెస్ లో  చేరూతున్నట్టు ప్రకటించడం, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి తో పాటు , చల్లమల్ల కృష్ణారెడ్డి అనే నేతతో రాజి చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి( Vivek Venkataswamy ) బిజెపి అక్కడ కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేటాయించడంతో ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.అలాగే భువనగిరి ఎంపీ బూరా నర్సయ్య గౌడ్( MP Boora Narsaiah Goud ) కూడా బిజెపిని వీడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .ఆయన టికెట్ విషయంలో అధిష్టానం ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అలక చెందారు.

  గద్వాలలో సీనియర్ న్యాయవాదైన వెంకటాద్రి రెడ్డిని నిలబెట్టి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని అరుణ కోరుతున్నారు.   

Advertisement

ఇక తన కుమారుడు నితిన్ రెడ్డికి షాద్ నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించి తనకు లోక్ సభ టికెట్ ఇవ్వాలని జితేందర్ రెడ్డి( Jithender Reddy ) కోరుతుండగా ఆయనను అసెంబ్లీకి పోటీ చేయాలని హై కమాండ్ కోరుతోంది.అయితే తాను అసెంబ్లీకి పోటీ చేయనని జితేందర్ రెడ్డి తేల్చి చెప్పేశారు.ఇక ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ విధంగా తెలంగాణ బిజెపిలో రోజురోజుకు అసంతృప్తి నేతలు పెరిగిపోతున్నా, తెలంగాణ బిజెపి అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి ఏ చర్యలు తీసుకోకుండా మౌనంగా నే ఉండిపోతుండడం పై  పార్టీలో ఆయన తీరుపై అనేక విమర్శలు , అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు