పేద మధ్య తరగతి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్ లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.ఏ బి వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో NTPC వారి సహకారంతో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఓయూ గవర్నమెంటు స్కూల్ లో హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ను ముఖ్య అతిథి గా పాల్గొని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రోహిణి,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలాంటి స్కూల్ లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తాను అన్నారు.టాయిలెట్స్ శుభ్రంగా లేనట్లయితే దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై వారి చదువుపై కూడా ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉంది.
ఈ టాయిలెట్ శుభ్రం చేయడంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఎన్ టి పి సి వారు తయారు చేసిన హై ప్రెషర్ టాయిలెట్ మిషన్స్ ను అందించారు.కాబట్టి వారికి ధన్యవాదాలు తెలిపారు.
టాయిలెట్స్ ను ఏ విధంగా ఉపయోగించాలి అని డెమో చూపించి,స్కూల్ లోని టాయిలెట్స్ శుభ్రం చేయించి చూపించారు ఎన్టిపీసీ సంస్థ వారు.