నేను ఎన్టీఆర్ విరాభిమానిని.. గాలి జనార్థన రెడ్డి కొడుకు మాటలకు అందరూ షాక్?

బళ్లారి ఈ పేరు వినగానే టక్కున అందరికీ గాలి జనార్దన్ రెడ్డి పేరు గుర్తుకొస్తుంది.రాజకీయాలలో ఎంతో చలాకీగా ఉన్నటువంటి ఈయన మంత్రిగా కొనసాగారు.

 Kireeti Reddy Reveals Junior Ntr His Favorite Hero Details, Ntr,gali Janarthana-TeluguStop.com

ఇలా కన్నడ రాజకీయాలలో ఎంత కీలకంగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గోల్డ్ మైనింగ్ విషయంలో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.ఇలా రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నటువంటి ఈయన ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

ఇలా రాజకీయాలలో ఎంతో పలుకుబడి సంపాదించుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిరెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇక ఇప్పటికే కిరీటి రెడ్డి నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరీటి రెడ్డి సినిమాల గురించి తన అభిమాన హీరో గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కిరీటిరెడ్డి మాట్లాడుతూ బళ్లారిలో మేము సినిమా పిచ్చోళ్లం.

మాకు భాషతో సంబంధం లేకుండా సినిమాని ఎంజాయ్ చేయడం ఇష్టమని తెలియజేశారు.అలాగే భాషతో సంబంధం లేకుండా ఇక్కడ విడుదలైన ప్రతి ఒక్క సినిమాని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటామని ఈయన తెలిపారు.

Telugu Bellary, Favorite, Galijanarthana, Kireeti Reddy, Ntr, Kannada, Kireetire

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అభిమాన హీరో ఎవరు అనే విషయం గురించి ఈయన సమాధానం చెబుతూ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తన అభిమాన హీరో అంటూ కామెంట్ చేశారు.ఎన్టీఆర్ సినిమాలు తప్పకుండా ప్రతి ఒక్కటి చూస్తానని ముఖ్యంగా ఆయన డాన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా కిరీటీ రెడ్డి ఎన్టీఆర్ గురించి ఆయన పై ఉన్న అభిమానం గురించి బయటపెట్టారు.ఇలా ఎన్టీఆర్ కి వీరాభిమానిగా ఉన్నటువంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి తనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube