బాలీవుడ్ ఆర్యన్ కేసులో మరో కొత్త కోణం.. ఏమిటంటే?

బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం గురించి మనందరికీ తెలిసిందే.తన కొడుకుని విడిపించడం కోసం షారుక్ ఖాన్ విశ్వప్రయత్నాలు చేశాడు.

 Shah Rukh Khan, Bollywood, Aryan Khan, Ncb, Drugs,latest Bollywood News-TeluguStop.com

చివరికి ఆర్యన్ ఖాన్ ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు.అయితే ఈ కేసు విషయంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆర్యన్ ఖాన్ ను కేసు నుంచి తప్పించడం కోసం కోట్లు డిమాండ్ చేశారు అంటూ, దీనికోసం పెద్ద డీల్ జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా కొత్త విషయాన్ని బయట పెట్టారు.

ఎన్సిబి అధికారులు నౌక పై దాడి చేసిన అనంతరం ఆర్యన్ ఖాన్ ను విడిచి పెట్టడానికి ఈ కేసులో సాక్షిగా అయిన కిరణ్ గోసావి, షారుక్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లని దగ్గర్నుంచి 50 లక్షలు తీసుకున్నారంటూ ఆరోపించారు.ఎన్సీబి ఆర్యన్ ను అరెస్టు చేయడంతో తిరిగి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేశారని ఈ డీల్ కు మధ్యవర్తిత్వం వహించి నట్టుగా అనుమానాలున్నా శామ్ విల్లి డిసౌజా ఆరోపించారు.

Telugu Aryan Khan, Bollywood, Drugs, Shah Rukh Khan-Movie

ఇక ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్ ను విడిచి పెట్టడానికి ఎన్సిబి అధికారుల తరపున మధ్యవర్తులు 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారని ఆరోపణలు సంగతి తెలిసిందే.ఇక ఈ ఆరోపణలలో వాస్తవాలను తేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందం ను ఏర్పాటు చేసింది.ఈ విషయం పట్ల ముందస్తు జాగ్రతతో తనని సిట్ అరెస్టు చేస్తుందని భయంతో బాంబే హైకోర్టులో డిసౌజా ముందుగానే బెయిల్ కోసం పిటిషన్ వేశాడు.దీనిని హైకోర్టు తిరస్కరిస్తూ కిరణ్ గోసవి, ప్రభాకర్ సాయిల్, ఈ కేసులో సాక్షులుగా వారిని వారే అసలుసిసలైన కుట్రదారులను డిసౌజా ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube