కిరణ్ అబ్బవరంతో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ల మీటర్ ఫస్ట్‌లుక్ విడుదల

డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం మీటర్.రమేష్ కాదూరి దర్శకుడు.

 Kiran Abbavaram, Mythri Movie Makers Meter First Look Unleashed , Kiran Abbavar-TeluguStop.com

ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.

శుక్రవారం కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీటర్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.ఫుల్‌మాసివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు కథానాయకుడు కిరణ్.ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.మోషన్‌పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాసివ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తుంది.ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా వుంటుందని చెబుతుంది చిత్రబృందం.

అత్యులరవి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సంభాషణలు: రమేష్ కాదూరి, సూర్య, డీఓపీ: వెంకట్.సి.దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్: జేవీ, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబాసాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ: వంశీ శేఖర్, మడూరి మధు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube