తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం తెలుగులో మంచి హీరో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
కానీ ప్రస్తుతం ఆయనకి వరుసగా ప్లాప్ లు రావడంతో ఇకమీదట ఆయన హీరో గా కొనసాగుతాడా లేదా అనే విషయం మీద ఇప్పుడు క్లారిటీ అయితే లేదు.వరుసగా ప్లాప్ లు రావడం తో ఆయన మార్కెట్ చాలా వరకు డౌన్ అయినట్టు గా తెలుస్తుంది.
ఇక ఇప్పటివరకు ఆయన చాలా సినిమాలు చేసిన కూడా స్టార్టింగ్ లో వచ్చిన ఒకటి, రెండు హిట్లు మాత్రమే తన ఖాతాలో ఉన్నాయి.కాబట్టి ఇప్పుడు ఆయన ఫేయిడ్ ఔట్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆయన మాత్రం ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు.ప్రస్తుతం ఇప్పుడు సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శివ అనే అబ్బాయి డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయిన కిరణ్ ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితేనే ఆయన మార్కెట్ అనేది పెరుగుతుంది.
లేకపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవడం చాలా కష్టం అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.హీరో గా మంచి అవకాశం వచ్చింది ఆ హోదా దొరకక ఒక్కొక్కడు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటిది వచ్చిన ఫేమ్ ని నాశనం చేసుకుంటున్నాడు అంటూ మరి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సక్సెస్ అయితేనే కిరణ్ సినీ కెరీయర్ సాఫి గా సగుతుంది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది…
.