మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ రైటేనా అంటూ ప్రశ్న.. కిరణ్ అబ్బవరం జవాబు ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అతి త్వరలో ఈ హీరో ( Ka Movie ) అనే వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు కాగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.అయితే ఈ సినిమా టీజర్ లాంఛ్ సందర్భంగా మీ స్థాయికి పాన్ ఇండియా మూవీ( Pan India Movie ) రైటేనా అంటూ కిరణ్ అబ్బవరంకు ప్రశ్న ఎదురైంది.

సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే ఎవరైనా సీరియస్ కావడం జరుగుతుంది.గతేడాది మీటర్, రూల్స్ రంజాన్ సినిమాలతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

సుజీత్, సందీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన క సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్ అబ్బవరం నా దృష్టిలో పాన్ ఇండియా స్థాయి అంటే కేవలం కంటెంట్( Content ) మాత్రమేనని అన్నారు.

Advertisement

యాక్టర్స్ పేర్లు తెలియకపోయినా మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారని కాంతార( Kantara ) సినిమాకు ముందు రిషబ్ శెట్టి( Rishab Shetty ) సైతం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న యాక్టర్ కాదని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.ఇక్కడ ఫైనల్ గా స్థాయి అంటే కంటెంట్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.నా స్థాయి పెద్దదా చిన్నదా అనే విషయం తర్వాత విషయం అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

క అనే సినిమాలో కంటెంట్ ఉందని నమ్ముతున్నానని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.కంటెంట్ ఉంటే మాత్రమే సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారని అందుకే ఇతర భాషల్లో సైతం ఈ సినిమాను తీసుకొస్తున్నామని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.కిరణ్ అబ్బవరం వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు