జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ ( Kirak RP ) ఒకరు.ఇక ఈయన జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ సక్సెస్ అయ్యారు.
అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ( Nellore Peddareddy Chepala Pulusu ) రెస్టారెంట్ బిజినెస్ పెట్టి బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.
ఇక ఈయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అనంతరం జబర్దస్త్ కార్యక్రమం పై అలాగే మల్లెమాల వారి పట్ల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి నాగబాబు కూడా కారణమంటూ వెల్లడించారు.అంతేకాకుండా తన బిజినెస్ గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఈయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్పీ చేపల పులుసు ధరలు మండిపోతున్నాయి అంటూ చాలామంది ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారని ఈయన తెలియజేశారు.

ఇక రేట్లు పెంచడం గురించి ఈయన మాట్లాడుతూ నా బిజినెస్.నా ఇష్టం.ఆ ధర పెట్టి కొనే స్థోమత నీకు ఉంటే నా దగ్గరకు రా లేకపోతే రావద్దు.చేపల పులుసుకు ఇతర వాటికి చాలా తేడాగా ఉంటుంది.
ఇక నువ్వు బెంజ్ కారు కొన్నావా ఆడి కారు కొన్నావా అనేది నీ స్తోమతను బట్టి ఉంటుంది.ఇది కూడా అంతే కొన్ని కెపాసిటీ ఉన్నవారు మాత్రమే కొంటారు.
తక్కువ రేటుకు అంటూ ఎలా పడితే అలా చేసి ఇవ్వలేము కదా అంటూ ఆర్పీ తెలిపారు.మేము చేపల పులుసు చేయడానికి అన్ని క్వాలిటీ ఉత్పత్తులనే వాడుతాము.
అందుబాటులో ఉన్న ధరలకు నువ్వు కొనగలిగితే తిను లేకపోతే వద్దు కానీ నాపై ఇలా తప్పుడు ప్రచారాలు మాత్రం చెయ్యొద్దు.నేను చేపల పులుసు తినాలని ఎవరిని బలవంతం చేయలేదు అంటూ తన బిజినెస్ పై దెబ్బ తీయాలి అనుకునే వారికి ఈయన వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.