మళ్లీ బిజినెస్ ను మొదలుపెట్టిన కిరాక్ ఆర్పీ.. ఈసారి వాళ్లతో కలిసి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

 Kiraak Rp Reopens Nellore Pedda Reddy Chepala Pulusu , Kiraak Rp, Jabardasth, Ne-TeluguStop.com

అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.ఇకపోతే ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కామెడీ షోలకు గుడ్ బాయ్ చెప్పేసి బిజినెస్ పై ఆసక్తిని చూపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాదులో ఒక కర్రీ పాయింట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే కిరాక్ ఆర్పి ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో కస్టమర్స్ వచ్చారు.

కర్రీ పాయింట్‌కు పెద్ద సంఖ్యలో జనాలు పోటెత్తారు.దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతుండటంతో తాత్కాలికంగా కొద్దిరోజులు కర్రీపాయింట్‌ను క్లోజ్‌ చేశాడు ఆర్పీ.డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు.బాగా రుచికరంగా వండిన కొందరు మహిళలను హైదారాబాద్‌కు తీసుకొచ్చి తిరిగి కర్రీపాయింట్‌ ప్రారంభించాడు.

డప్పుచప్పుళ్ల మధ్య కేక్‌ కట్‌ చేసి షాప్‌ను తిరిగి ఓపెన్‌ చేశాడు.నెల్లూరు నుంచి తీసుకొచ్చిన మహిళలకు ప్రస్తుతానికి తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చాడు ఆర్పీ.

మహిళలందరూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వంట మొదలుపెడతారని నాలుగు గంటల్లో వంట పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు.తమ కర్రీ పాయింట్‌కు ఇప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్పీ.ఇకపోతే ఆర్పీ ఇటీవలే జబర్దస్త్ షో గురించి జబర్దస్త్ షో నిర్వాహకుల గురించి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ వార్తలతో కొద్దిరోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్పీ పేరు మారుమూగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube