దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరోగా అభిలాష్ జోష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత( King of Kotha ).ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఐశ్వర్య లక్ష్మి, అనిక కూడా నటించారు.
యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో దుల్కర్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది.
సినిమాకు పోటీగా చాలా సినిమాలు వస్తున్నాయి.అయితే మలయాళం నుంచి వస్తున్న కె.జి.ఎఫ్ సినిమాగా ఈ కింగ్ ఆఫ్ కోత సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
కె.జి.ఎఫ్( KGF ) సినిమా కన్నడ నుంచి వచ్చింది.మలయాళం నుంచి కమర్షియల్ సినిమాకు రావడం చాలా అరుదు.
అలాంటిది కింగ్ ఆఫ్ కోత సినిమా భారీ యాక్షన్ మూవీగా వస్తుంది.మరి ఈ సినిమా నిజంగానే మలయాళ కె.జి.ఎఫ్ అవుతుందా.దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాకు పోటీగా ఒకరోజు తేడాతో బెదురులంక 2012, వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమాలు కూడా వస్తున్నాయి.
మరి ఈ పోటీని తట్టుకుని కింగ్ ఆఫ్ కోత సినిమా నిలబడుతందా లేదా అన్నది చూడాలి.