అమ్మాయి జీవితం పెళ్లికి ముందు ఒకలా.పెళ్లి తరువాత మరోలా ఉంటుంది.
పెళ్లి తర్వాత కొంతమంది అమ్మాయిలు జీవితం మాత్రమే సాఫీగా సాగుతోంది.మరికొంతమంది అమ్మాయిల జీవితం అదనపు కట్నం(Dowry), ఇతర కారణాలతో ఒకపక్క అత్తమామలు.
మరో పక్క భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
ఇటీవలె కాలంలో ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరుగుతూ, చివరికి అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు.
తాజాగా ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక(karnataka) రాష్ట్రంలోని చిత్రదుర్గ తాలూకాలోని భూగళనహాట్టి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ డ్రైవర్ గా పని చేస్తూ, గూళయ్యా హట్టి గ్రామానికి చెందిన గోవిందప్ప కూతురును మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.గోవిందప్ప కు భార్య లేకపోయినా తాహతకు ఏమాత్రం తక్కువ కాకుండా కట్నం ఇచ్చి గొప్పగా వివాహం జరిపించాడు.
తర్వాత కూడా కూతురికి ఎటువంటి లోటు లేకుండా అవసరమైనవి పంపించేవాడు.ఇక చంద్రశేఖర్, గౌతమిల వివాహం కొంతకాలం మూడు పూవులు ఆరుకాయలు లాగే సాగింది.

కొంతకాలం తరువాత అదనపు కట్నం తేవాలని చంద్రశేఖర్ చిత్రహింసలకు గురి చేయడంతో పెద్దమనుషుల మధ్య పంచాయతీ జరిగి గోవిందప్ప రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.అయినా కూడా చంద్రశేఖర్ మొత్తం ఆస్తి మొత్తం తీసుకురావాలని మార్చి 11న భార్యతో గొడవకు దిగాడుగొడవ పెరగడంతో క్షణికావేశంలో భార్యను చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని పోలీస్ స్టేషన్(Police station) కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.పోలీసుల విచారణలో అదనపు కట్నం కోసం చంద్రశేఖరే భార్యను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించి నాటకాలు ఆడుతున్న విషయం బయటపడింది.పోలీసులు చంద్రశేఖర్ ని అరెస్టు చేశారు.







