చంద్రబాబు అరెస్ట్ తర్వాత కిలారు రాజేష్( Kilaru Rajesh ) పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది.అయితే లోకేష్ కి క్లోజ్ ఫ్రెండ్ అయినా రాజేష్ కి జూనియర్ ఎన్టీఆర్ కి( Jr NTR ) ఏంటి సంబంధం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ప్రశ్న.
విషయం లోకి వెళ్తే మొట్ట మొదట కిలారు రాజేష్ తెలుగు దేశం పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు.ఆ టైం లో నార్నె శ్రీనివాస్ తో( Narne Srinivas ) గల పరిచయం తో మీడియా ను కూడా కిలారు రాజేష్ బాగా హ్యాండిల్ చేయడం మొదలు పెట్టాడు.
ఈ నార్నె శ్రీనివాస్ మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ మామ మరియు లక్ష్మి ప్రణతి కి స్వయానా తండ్రి.

ఈయనకు అప్పట్లో స్టూడియో ఎన్ అనే ఒక ఛానెల్ ఉండేది.దాని ద్వారా తెలుగు దేశం పార్టీ కి( TDP ) బ్యాక్ సపోర్ట్ బాగా ఇచ్చేవారు.అలా మొత్తానికి నార్నె వారిని అమ్మాయిని నందమూరి ఇంటి కోడలును చేయడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం కూడా బాగానే పెంచుకుంటూ పోయాడు.
ఆలా తారక్ ని ఒకసారి టీడీపీ కి ఎలక్షన్స్ కి సపోర్ట్ చేయించాడు కూడా.ఆ టైం లో నందమూరి అభిమానుల్లో మంచి ఉత్సాహం కూడా నిండి పోయింది.
ఆలా మొత్తానికి నార్నె, నందమూరి కుటుంబాలతో మంచి స్నేహమే కాకుండా నారా వారికి కూడా సన్నిహితుడు.

నారా లోకేష్ ని( Nara Lokesh ) వెనక ఉండి నడిపించేది కిలారు రాజేష్ అని అతడి ప్రత్యర్థులు ఎన్నో సార్లు మీడియా ముఖంగా చెప్పారు.ఆఖరుకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా అతడి సోషల్ మీడియాలో రాజేష్ గురించి మాట్లాడాడు.లోకేష్ తన తండ్రి కన్నా కూడా కిలారు రాజేష్ చెప్పిన మాటలకు విలువ ఇస్తాడు అని టీడీపీ పార్టీ లో కూడా కింద క్యాడర్ గుసగుసలాడుతూ ఉంటారు.
ఏది ఏమైనా మొత్తానికి ఎక్కడ ఏమి జరిగిన, మీడియా సెన్సేషన్ మాత్రం కిలారు రాజేష్ అయిపోయాడు.







