ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యతో ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో ( Canadian Prime Minister Justin Trudeau )వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇరు దేశాలు ఇప్పటికే దౌత్యవేత్తలను బహిష్కరించాయి.అయితే కెనడాలో వుంటున్న సిక్కుయేతర మతస్తులు ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
భయపడినట్లుగానే సిక్స్ ఫర్ జస్టిస్ ( Six for Justice )(ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా స్పందిస్తోంది.హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.
ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.ఈ మేరకు ఆ సంస్థ కీలక నేత, న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో కెనడాలో హిందువులు ( Hindus in Canada )ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పొరుగునే వున్న భారతీయ అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేశారు.కెనడాలో హిందువులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, విద్వేషపూరిత వాతావరణాన్ని ఖండించింది.మౌనంగా వుండటం ద్వారా ద్వేషపూరిత నేరాలను ఆమోదించవద్దని భారతీయ అమెరికన్ల బృందం కెనడా ప్రభుత్వాన్ని కోరింది.అమెరికాలోని హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ , అండర్‌స్టాండింగ్ హిందూఫోబియా సహ వ్యవస్థాపకురాలు ఇందు విశ్వనాథన్( Viswanathan ) మాట్లాడుతూ.
కెనడియన్ గడ్డపై హిందూ పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడం ద్వారా ఖలిస్తానీ ఉగ్రవాదులు హిందూ కెనడియన్లను పదే పదేప బెదిరించడం ఆందోళనకరమన్నారు.దీనిని రాజకీయ వ్యక్తీకరణ అని సమర్ధించడం, ద్వేషపూరిత నేరాలను ఆమోదించడానికి సమానమని ఇందు వ్యాఖ్యానించారు.

ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్‌ఐఐడీఎస్)కు చెందిన ఖండేరావ్ కాండ్ మాట్లాడుతూ.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భావ ప్రకటనా స్వేచ్ఛ , ఉగ్రవాద స్వేచ్ఛను కలపకూడదని హితవు పలికారు.ముందు దేశంలో పేట్రేగిపోతున్న రాడికలైజేషన్, డ్రగ్స్ ముఠాలను అడ్డుకోవాలని, అంతర్జాతీయ ఇబ్బందులను దౌత్యపరంగా నిర్వహించాలని ఖండేరావ్ సూచించారు.అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ప్రభుత్వ వ్యవహారాల చైర్ డాక్టర్ సంపత్ శివాంగి మాట్లాడుతూ.
కెనడాలోని భారతీయులు, హిందువులు, లక్షలాది మంది విద్యార్ధులను రక్షించడానికి కెనడాకు సందేశం పంపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఎస్ కాంగ్రెస్‌కు శివాంగి విజ్ఞప్తి చేశారు.
.






