ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.? అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..! తప్పక తెలుసుకోండి!

కిడ్నీ స్టోన్స్.! ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగామారింది.

మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం.కొంతమంది ఈ కిడ్నీలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు.

అది 7 - 8 మీటర్లు పెరిగేదాకా దాన్ని పట్టించుకోవట్లేదు.దీనికి రాళ్లు ఏర్పడిన తాలూకు లక్షణాలేవీ తెలియకపోవడం కారణమా? లేక ఆ లక్షణాల్ని వీళ్లు నిర్లక్ష్యం చేస్తారా? ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయో, వాటిని ఏ మేరకు గుర్తించవచ్చో చూడండి.

మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు.కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా.అయితే కింద ఇచ్చిన సందర్భాల్లో కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

అవేమిటో చూద్దాం.కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది.

ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు.ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది.ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది.

ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.

క్లాస్‌లో ఏసీ నుంచి బయటకు వచ్చిన పాము.. దెబ్బకి విద్యార్థులు..?
జగన్ తప్పు తెలుసుకున్నారుగా .. మార్పు కనిపిస్తోంది గా ? 

మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి.ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది.అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.

Advertisement

వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది.అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది.

మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి.

కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గ్రహించి వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే, సమస్య నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి.ఈ విలువైన సమాచారాన్ని మీ శ్రేయోభిలాషులు అందరికి షేర్ చేయండి.

ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.

తాజా వార్తలు