జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ కు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.రామకృష్ణయ్య బయటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.
స్వగ్రామం అయిన పోచన్నపేట నుంచి రామకృష్ణయ్య బైకుపై బచ్చన్నపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.అయితే ఆర్బీఐ చట్టం కింద పలు అక్రమాలను రామకృష్ణయ్య వెలికితీశారు.
ఈ క్రమంలో కిడ్నాప్ చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.