ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా మెగా ఫ్యామిలీకి సంబంధించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.మెగా ఫ్యామిలీ( Mega Family )లో తరచూ ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు.
ఇకపోతే మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.మొదట పవన్ కళ్యాణ్ నుంచే లవ్ స్టోరీలు ప్రారంభమయ్యాయి.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.తర్వాత చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బంధాలు ఎక్కువ కాలం నిలవలేదు.ఇక తాజాగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి( Varun Tej-Lavanya Tripathi ) లు ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ వేడుక చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరిద్దరు లవ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.కానీ వాటిని రహస్యంగా ఉంచుతూ, ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌తో ఓపెన్ అయ్యారు.గత వారం వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు.
కాగా త్వరలో ఈ ఇద్దరు పెళ్లిపీఠలెక్కబోతున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కొంప ముంచుతోంది.అదేంటి అనుకున్నారా.మొన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుక జరిగిందో లేదో అప్పటినుంచి సాయి ధరమ్ తేజ్ ప్రేమ వ్యవహారం కాస్త ఇప్పుడు ట్రెండింగ్ హాట్ టాపిక్ గా మారింది.
సాయిధరమ్ తేజ్ కూడా ప్రేమలో ఉన్నాడనే వార్తలు చాలా కాలం క్రితం వినిపించాయి.సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) హీరోయిన్ రెజీనాతో లవ్ లో ఉన్నట్టు అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా ఈ ఇద్దరు కలిసి తిరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే అప్పట్లో సోషల్ మీడియా ఈ రేంజ్‌లో లేకపోవడంతో అవి అంతగా స్ప్రెడ్ కాలేదు, కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం బాగానే చర్చ జరిగింది.సాయి, రెజీనా( Sai Dharam Tej-Regina ) ) ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారని అన్నారు.ఈ ఇద్దరు కలిసి పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలలో కలిసి నటించారు.
ఆ సినిమాల సమయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.దీంతో అప్పటి నుంచి ఈ వీరిద్దరికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఆ తర్వాత మధ్యలో కొద్ది రోజులపాటు ఆ వార్తలు నిలిచిపోయాయి.ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ తర్వాత ఈ వార్తలు మరోసారి జోరుగా వినిపిస్తున్నాయి.
దీంతో ఎంకిపెల్లి సుబ్బిచావుకు వచ్చినట్లు అయింది.







