హైదరాబాద్, 22nd సెప్టెంబర్ 2022: మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి పండగలకు మించిన అవకాశం మరొకటి ఉండదు.ఐతే, మీ ఫెస్టివల్ మరియు ఫ్యామిలీ టైంకి ఇంకాస్త వినోదాన్ని జోడిస్తే అంతకన్నా కావాల్సిందేముంది.
ఇటీవలే వినాయక చవితికి వినోదభరితమైన ఈవెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జీ తెలుగు‘, ఇప్పుడు దానికి రెట్టింపు వినోదాత్మకమైన మరో ఈవెంట్ తో నవరాత్రులకి స్వాగతం పలకడానికి సిద్ధమైంది రారండోయ్ పండగ చేద్దాం‘ అంటూ సెప్టెంబర్ 25న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా మీ ముందుకు రాబోతున్న ఈ దసరా స్పెషల్ ఈవెంట్ కి సినిమా మరియు టీవీ పరిశ్రమల నుండి పలువురు నటీనటులు విచ్చేయనున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే, క్లాస్ Vs మాస్ థీమ్ తో వస్తున్న ఈ ఫెస్టివల్ ఈవెంట్లో అమ్మాయిలు (క్లాస్) మరియు అబ్బాయిలు (మాస్) రెండు జట్లుగా విడిపోయి పటిపడనుండగా వారికి ఆమని మరియు బాబా భాస్కర్ టీం లీడర్లుగా వ్యవహరించనున్నారు.రీల్-మేకింగ్ ఛాలెంజ్, రాంప్ వాక్, బొబ్బట్ల తయారీ వంటి మరెన్నో హాస్యభరితమైన పోటీలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు కొన్ని ప్రదర్శనలు ప్రేత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.‘జీ సరిగమప‘ గత రెండు సీజన్లలో పాల్గొని ప్రేక్షకులను అలరించిన సింగర్స్ అమ్మవారిపై ఒక పవర్ఫుల్యా క్ట్ తో మెరవబోతుండగా, సింగర్ కల్పన మరియు బాబా భాస్కర్ మాస్టర్ కలిసి ఒక మాస్ పాటకి చిందులు వేయనున్నారు.కమెడియన్స్ సద్దాం మరియు వేణు తమదైన శైలిలో వినోదాత్మకమైన స్కిట్స్ తో అదరగొట్టబోతుండగా, ‘రైటర్ పద్మభూషణ్‘ మరియు ‘అల్లూరి’ చిత్రయూనిట్లకు చెందిన నటీనటుల యొక్క ఫన్నీ చిట్ చాట్అం దరిని ఆకట్టుకోనుంది.అంతేకాకుండా, యాంకర్ ప్రదీప్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న ఒక హాస్యభరితమైన ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఈవెంట్ కే హైలైట్ గా నిలవనుంది.
కావున, ఈ పండగ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా చూడండి.