సెట్ లో స్పాంజ్ లా ఉన్నాను..RC 15 గురించి కియారా కామెంట్స్ వైరల్!

సెట్ లో స్పాంజ్ లా ఉన్నాను..RC 15 గురించి కియారా కామెంట్స్ వైరల్!

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 సెట్ లో స్పాంజ్ లా ఉన్నాను..rc 15 గురించి కియారా కామెంట్స్ వైరల్!-TeluguStop.com

అయితే ఈ సినిమా నటి కియార అద్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఈ రెండు సినిమాల తర్వాత ఈమె పూర్తిగా తెలుగు దూరమై బాలీవుడ్ బాట పట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి ఈమె ప్రస్తుతం తిరిగి రామ్ చరణ్ సరసన మరొక సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కీయారా అద్వానీ పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.RC15 అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి కియారా అద్వానీ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 సెట్ లో స్పాంజ్ లా ఉన్నాను..RC 15 గురించి కియారా కామెంట్స్ వైరల్!-సెట్ లో స్పాంజ్ లా ఉన్నాను..RC 15 గురించి కియారా కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కియారా మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర గురించి, కథ గురించి చెప్పడానికి నాకు అనుమతి లేదు.నేను నా పాత్ర గురించి ఏమీ చెప్పలేను ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం అంటూ ఈ సినిమా గురించి వెల్లడించారు.డైరెక్టర్ శంకర్ ఎలాంటి పాత్రనైనా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు.

ఇకపోతే ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది.ప్రస్తుతం తాను RC15 సెట్ లో తాను ఒక స్పాంజ్ లా ఉన్నానని, నా చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు తన కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో సంతోషంగా ఉందని కియార వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube