తేవర్ మగన్ అనే పేరు తో తమిళ భాషలో కమల్ హాసన్, శివాజీ గణేశన్ మెయిన్ లీడ్ లో గౌతమి, రేవతి తో జంట గా నటించగా, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇది అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలిచింది.
ఇళయరాజా సంగీతం అందించిన తమిళ మాతృక ఏకంగా 175 రోజులు ఆడింది.అప్పట్లో ఈ సినిమాలోని పాటలు కూడా అద్భుతంగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
ఇదే సినిమాను తెలుగు క్షత్రియ పుత్రుడు పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా బాగా ఆడింది.ఇక ఈ చిత్రంలో సన్నజాజి పడక అంటూ సాగే పాట ఇప్పటికి చాల ఫెమస్.
మురిసే పండగ అంటూ సాగే పాట కోసం సంగీతానికి బదులు కుండను కొడుతూ మ్యూజిక్ అందించాడట ఇళయరాజా. ఇలా ఎన్నో విశేషాలతో వచ్చిన ఈ చిత్రానికి హిందీ రీమేక్ కూడా వచ్చింది.
హిందీ లో విరాశత్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరోగా నటించగా అమ్రిష్ పూరి మరియు టబు ప్రధాన పాత్రల్లో నటించారు.తమిళ్ మరియు తెలుగు తో పోలిస్తే హిందీ లో ఈ సినిమా మరింత పెద్ద హిట్టుని దక్కించుకుందని చెప్పాలి.ఏకంగా సినిమా ఆ ఏడాది ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.1997 లో వచ్చిన ఈ సినిమా అనిల్ కపూర్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు.ఇక ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమా ఏకంగా ఒకటి రెండు కాదు 16 వివిభాగాల్లో ఫిల్మ్ ఫర్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యి సంచలనం సృష్టించింది.
తెలుగు లో సైతం 5 నేషనల్ అవార్డ్స్ ని దక్కించుకున్న క్షత్రియ పుత్రుడు, విడుదలైన అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కించుకోవడం విశేషం.అయితే ఈ సినిమాకు ప్రేరణ మాత్రం అమెరికా లో 1972 లో వచ్చిన గాడ్ ఫాదర్ అడాప్టేషన్ అనే చిత్రం అంటూ ఉంటారు.ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ తెలుగు తమిళం కంటే ఇది హిందీ లో ఎక్కువ పాపులర్ అయ్యి ఎక్కువగా అవార్డులను దక్కించుకుంది.